Header Banner

విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు వైసీపీకి ఎలాంటి అర్హత లేదు! మంత్రి ఘాటు విమర్శలు!

  Fri Mar 14, 2025 14:43        Politics

విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. 2014-2019లో మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని అప్పగించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్వార్థంతో విద్యుత్ రంగాన్ని నష్టపరిచిందని మండిపడ్డారు. అర్హత ఉన్న ఏ లబ్దిదారుడికి పింఛన్లు తొలగించడం లేదని స్పష్టం చేశారు.అర్హులకు పింఛన్లు తొలగిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో జనాన్ని తీసుకువచ్చారని అన్నారు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీలను తానే తగ్గించాలని ధర్నా చేసిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం జగన్ అని విమర్శలు చేశారు. తాను బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని.. జగన్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #power #current #todaynews #flashnews #latestnews